Fri Apr 04 2025 23:19:42 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతమంది పిల్లలున్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉండగా, ఇప్పటి నుంచి ఎంతమందికైనా సెలవులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
గతంలో అధిక సంతానం వద్దంటూ...
గతంలో అధిక సంతానం వద్దని తానే చెప్పానని, ఇప్పుడు పిల్లలు కనాలని చెబుతున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అలాగే ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగంగా అట్టడుగువర్గాల కుటుంబాలందరికీ ఈ పథకం వచ్చే విద్యాసంవత్సరం నుంచి వర్తింపచేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story