Thu Dec 19 2024 09:52:27 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : చంద్రబాబు సంచలన నిర్ణయం... పేర్లు మార్చేశారు.. ప్రాజెక్టుల పేర్లన్నీ మళ్లీ మొదటికి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల పేర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టుల పేర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల పేర్లు మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించి పాత పేర్లను పెడుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని పన్నెండు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పేర్లను తొలగిస్తూ, వాటికి పాత పేర్లను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
పన్నెండు ప్రాజెక్టులకు...
వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు పేరును గోదావరి - పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టుగా మార్చారు. వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానిక ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా పేర్లు మార్చారు. పాత పేర్లే ఇక అమలులో ఉంటాయని గత ప్రభుత్వం పేర్లను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Next Story