Mon Dec 16 2024 13:45:16 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : పోలవరం పర్యటనలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. వ్యూపాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. పోలవరం నిర్మాణ పనుల పురోగతికి సంబంధించిన వివాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.డయా ఫ్రం వాల్,గైడ్ బండ్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులను అడిగారు.
నిర్వాసితులకు పరిహారంపై...
ఈ పనులకు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. అనంతరం అధికారులతో పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష చేస్తున్నారు. ఈ సమీక్షలో నిర్వాసితులకు పరిహారం అందచేత విషయంపై ప్రముఖంగా చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న చంద్రబాబును మంత్రులు నిమ్మల రామానాయుడు,పార్థసారధితో పాటు అధికారులు స్వాగతం పలికారు.ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story