Wed Dec 25 2024 16:43:46 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : లేఖలతో జగన్ విసిగిస్తున్నాడా? చంద్రబాబులో ఆ ఫ్రస్టేషన్ ఎందుకు?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. వైఎస్ జగన్ తన లేఖలతో ఆయనకు విసుగు తెప్పిస్తున్నట్లుగా ఉంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. వైఎస్ జగన్ తన లేఖలతో ఆయనకు విసుగు తెప్పిస్తున్నట్లుగా ఉంది. తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు దేశమంతా అంటుకుంది. దానికి కారణం చంద్రబాబే. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో కూడిన నూనె కలిసిందని ఆయన చేసిన ఆరోపణలు సంచలనమే అయ్యాయి. అనేక రిపోర్టులను చంద్రబాబు బయటపెట్టారు. టీటీడీ ఈవో కూడా వివరణ ఇచ్చారు. అయినా సరే జగన్ కూడా మీడియా సమావేశం పెట్టి ఇదీ జరిగిన సంగతి అంటూ రివర్స్ అటాక్ కు దిగారు. దీంతో పాటు వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ప్రధాని మోదీకి లేఖ రాసి...
తిరుమల లడ్డూ వివాదంలో జరిగిన వాస్తవాలు ఇవీ అంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు. తిరుమలలో లడ్డూ తయారీకి అవలంబించే పద్ధతిని గురించి ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎన్ని దశల్లో నెయ్యిని, లడ్డూ తయారీలో వాడే పదార్థాలను పరిశీలిస్తారో చెప్పుకొచ్చారు. నేషనల్ డెయిరీ డెవలెప్మెంట్ బోర్డు అనుమతిస్తూ లేఖ ఉంటేనే తిరుమల కొండపైకి నెయ్యి ట్యాంకర్ ను అనుమతించే విధానం కొన్నేళ్లుగా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇలా పూసగుచ్చినట్లు జగన్ చెప్పుకురావడంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. ఆయ్.. ఎన్ని గట్స్.. ప్రధానికే లేఖ రాస్తాడా? ఎంత గుండె ధైర్యం అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సీబీఐకి అప్పగించకుండా...
నిజానికి తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటే సీబీఐకి అప్పగించవచ్చు కదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీబీఐకి అప్పగించకుండా చంద్రబాబు నాయుడు స్సెషల్ ఇన్విస్టిగేషన్ టీం వేసి దర్యాప్తునకు ఆదేశించడమేంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ధైర్యముంటే నెయ్యి కల్తీ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఫ్యాన్ పార్టీ నేతలు సవాళ్లు విసురుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మరోవైపు తిరుమలలో మహాశాంతి యాగం, సంప్రోక్షణ వంటి కార్యక్రమాలను చేపడతూ చంద్రబాబు కూడా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే బలంగా చెబుతున్నారు. నేరగాళ్లను వదిలపెట్టబోమంటూ వార్నింగ్ ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు.
అందరి ముఖ్యమంత్రులకు...
ఒకవైపు ఇది నడుస్తుండగానే వైఎస్ జగన్ ఊరుకుంటారా? ఆయన దేశంలో ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాశారు. చంద్రబాబు తిరుమల లడ్డూ వివాదాన్ని ఎందుకు బయటకు తీసుకు వచ్చారో వివరిస్తూ అందరి ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. కేవలం చంద్రబాబు ఎన్నికల్లో చేసిన హామీలను అమలు చేయలేక తిరుమల లడ్డూ వివాదాన్ని తెర మీదకు తెచ్చారంటూ లేఖలో ప్రస్తావించడం చంద్రబాబుకు చికాకు కలిగిస్తుంది. జాతీయ స్థాయిలో జగన్ తన పరువు తీస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టును కూడా వైసీీపీ నేతలు ఆశ్రయించడంతో తిరుమల లడ్డూ లడాయి ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
Next Story