Sun Apr 06 2025 04:33:40 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నేడు టీడీపీ అభ్యర్థిని ఖరారు చేయనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. నామినేషన్లు దాఖలు చేయడానికి రేపటితో గడువు ముగియనుండటంతో ఈరోజు అభ్యర్థిని ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నేతలతోనూ, మంత్రులు, ఎమ్మెల్యేలతోనూ ఆయన చర్చించారు.
పార్టీ నేతలతో చర్చించి...
కూటమి బలం, వైసీపీ బలం విషయంలో ఆయన ఒక అవగాహనకు వచ్చారు. క్యాంప్‌నకు తరలించి వచ్చిన అభ్యర్థులను ఎలా సంప్రదించాలన్న విషయంపై కూడా నేతలతో చర్చించినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ప్రముఖంగా పీలా గోవింద సత్యనారాయణ పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయని తెలిసింది. ఇంకా కొన్ని పేర్లను చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఎవరి పేరును ఖరారు చేస్తారన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.
Next Story