Mon Dec 23 2024 07:06:19 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : తిరుమల లడ్డూలపై చంద్రబాబు సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో తిరుమల లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ప్రసాదంలో వైసీపీ ప్రభుత్వ హాయాంలో తిరుమల లడ్డూలో నాసిరకంగా తయారు చేశారన్నారు. వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశారన్నారు. తిరుమలలో దుర్మార్గంగా ప్రవర్తించారన్నారు. అక్కడ నాణ్యత లేకుండా లడ్డూను తయారు చేశారన్నారు.
లడ్డూలో జంతువుల నూనె...
తిరుమల లడ్డూలో జంతువుల నూనెను వాడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడటం తనను బాధించిందన్నారు. అన్నదానంలో నాణ్యత లేకుండా చేశారన్నారు. ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నాణ్యతను వాడుతున్నామని తెలిపారు. తిరుమలలో అన్ని ప్రక్షాళన చేశామన్నారు.
Next Story