Thu Dec 26 2024 14:48:19 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ప్రధాని నరేంద్ర మోదీతో ముగిసన చంద్రబాబు భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. వీరిద్దరి సమావేశం దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు సాగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈసందర్భంగా మోదీకి చంద్రబాబు వివరించినట్లు తెలిసింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి అధిక నిధులు ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరినట్లు చెబుతున్నారు. దీంతో పాటు సుదీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ అంశాలను కూడా పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు మోదీని కోరినట్లు తెలిసింది. ఇందుకు నరేంద్ర మోదీ సానుకూలంగానే స్పందించారని తెలిసింది.
బడ్జెల్ నిధులను...
దీంతో పాటు వచ్చే బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కూడా చంద్రబాబు కోరినట్లు తెలిసింది. నిన్న విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు ఉదయం కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను కలిశారు. వివిధ అంశాలపై ఆయన చర్చించారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. సాయంత్రం కూడా మరికొందరు కేంద్ర మంత్రులతో సమావేశమై పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
Next Story