Fri Dec 27 2024 10:17:55 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించిన అంశాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ప్రధానిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులు, రహదారుల అభివృద్ధి, రైల్వే జోన్ శంకుస్థాపన, సెయిల్ లో విశాఖ స్టీల్ విలీనం వంటి వాటిపై చర్చించారు.
వరద నిధులను...
ఇటీవల సంభవించిన భారీ వరదల వల్ల ఏపీలో జరిగిన నష్టానికి కేంద్రం నుంచి సాయం వెయ్యి కోట్ల రూపాయల వరకూ అందింది. అయితే జాతీయ విపత్తు కింద పరిగణించి మరిన్ని నిధులు ఇవ్వాలని చంద్రబాబు మోదీని కోరినట్లు సమాచారం. ప్రధాని మోదీ భేటీ తర్వాత కేంద్ర రైల్వే శాఖ అశ్వినీ వైష్ణవ్ తో సమావేశం కానున్నారు.
Next Story