Mon Mar 31 2025 00:02:33 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు ఈ బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పర్యటనలో ఒక చిన్నారికి నామకరణం చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం పర్యటనలో ఒక చిన్నారికి నామకరణం చేశారు. ఈ నెల 245, 26 తేదీల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టి తొలిసారి కుప్పం నియజకవర్గానికి రావడంతో ఆయనను కలుసుకునేందుకు పెద్దయెత్తున ప్రజలు తరలి వచ్చారు. ఆయన కూడా స్వయంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
శాంతిపురానికి చెందిన...
సొంత నియోజకవర్గంలో మరో అరుదైన ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సమయంలో సుధాకర్, ప్రియ దంపతులు తమ చిన్నారితో అక్కడకు వచ్చారు. వారిది కుప్పం నియోజకవర్గం శాంతిపురం. అయితే తమ బిడ్డకు నామకరణం చేయాలని చంద్రబాబును ఆ దంపతులు కోరగా అందుకు చంద్రబాబు అంగీకరించారు. ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని చంద్రబాబు చరణిగా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి పెట్టిన పేరుతో ఆ దంపతులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు.
Next Story