Sun Apr 13 2025 18:33:56 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : తిరుమలపై చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్షించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్షించారు. వీరికి పలు సూచనలు చేశారు. వచ్చే యాభై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని కోరారు. అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేకపోయినా పాతవారిని ఇంకా కొనసాగించ వద్దని తెలిపారు.త్వరలో జేఈవో, సీవీఎస్ఓ, ఎస్వీబీసీ చైర్మన్, బర్డ్ డైరెక్టర్ల నియామకం జరుగుతుందని తెలిపారు.
ప్రక్షాళన జరగాల్సిందే...
ప్రక్షాళన వందశాతం జరగాల్సిందేనన్న చంద్రబాబు నాయుడుఏ స్ధాయిలోనూ మినహాయింపులు లేవని చెప్పారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్‌క్యాంప్ నిర్మాణం చేపట్టాలని, అరవై అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిసేవపై భక్తుల ఫీడ్‌బ్యాక్ ను తీసుకోవాలని, త్వరలో వాట్సాప్ సేవలు ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. టీటీడీ సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలన్న చంద్రబాబు తిరుమలలో సేవలు బాగుంటే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుందని, అభివృద్ది పనుల పేరుతో డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దని తెలిపారు.టీటీడీలో మనం ధర్మకర్తలం, నిమిత్తమాత్రులం మాత్రమేనని చంద్రబాబు చెప్పారు.
Next Story