Mon Dec 23 2024 23:57:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : గుడ్న్యూస్ చెప్పిన... చంద్రబాబు .. వారికి నెలకు పదివేలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. వారి ఖాతాల్లో నెలకు పది వేల రూపాయలు జమ చేయాలని నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. వారి ఖాతాల్లో నెలకు పది వేల రూపాయలు జమ చేయాలని నిర్ణయించారు. ఈరోజు న్యాయశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన ఈ ప్రకటన చేశారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు పది వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయకళాశాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులు కోరారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీని ఏర్పాటు చేయాలని, ఇందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కోరారు.
ఇమామ్లకు పదివేలు...
తర్వాత మైనారిటీ సంక్షేమంపై సమీక్ష చేసిన చంద్రబాబు మసీదులో ఉండే ఇమామ్ లకు పది వేల రూపాయలు, మౌజన్ లకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని కూడా నిర్ణయించారు. మైనారిటీలకు చెందిన వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కడపలో హజ్ హౌన్ ను నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నూర్భాషా కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు నిర్ణయించారు.
Next Story