Wed Dec 25 2024 16:29:37 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : సుప్రీంకోర్టు తీర్పు పై చంద్రబాబు ట్వీట్ ఏం చేశారంటే?
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన తన అభిప్రాయాన్ని ఎక్స్ లో ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ పై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కూడా చంద్రబాబు నాయుడు తాను చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.
సత్యమేవ జయతే అని....
దీంతో పాటు సత్యమేవ జయతే అని ఆయన చివర్లో రాసుకొచ్చారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా ఒక సిట్ ను ఏర్పాటు చేసింది. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికారులు, ఒకరు కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందని ఫుడ్ సేప్టీ అథారిటీకి చెందిన ఆఫీసర్ ను సభ్యులుగా నియమించింది.
Next Story