Fri Dec 20 2024 18:14:54 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం.. అవన్నీ రద్దు.. కొత్తవి జారీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ శాఖ సమీక్షలో చంద్రబాబు అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. భూ యజమానులకు గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పుస్తకాల స్థానంలో కొత్తవి ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో జగన్ బొమ్మతో జారీ చేసిన పాస్ పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో రాజముద్రను ముద్రించి ఇవ్వాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. పాస్ పుస్తకాల కోసం గత ప్రభుత్వం పదిహేను కోట్ల రూపాయలు వెచ్చించిందని తెలిపారు.
రాజముద్రతో కలిగిన...
తాము అధికారంలోకి వస్తే కొత్త పాస్ పుస్తకాలను రాజముద్రతో ముద్రించి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని నిర్ణయించారు. సరిహద్దురాళ్లపైన కూడా జగన్ బొమ్మలను ముద్రించారని, వీటి కోసం 650 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమీక్షలో చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం 77 లక్షల గ్రానైట్ రాళ్లను సిద్ధం చేశారని, వాటిని ఏమి చేయాలన్న దానిపై ఆలోచన చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. వాటిని ఉపయోగించుకోకుండా మరో రకంగా ఎలా వినియోగించుకోవచ్చో నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Next Story