Thu Nov 21 2024 13:06:27 GMT+0000 (Coordinated Universal Time)
Amaravathi : ఏపీ వాసులకు గుడ్ న్యూస్ చంద్రబాబు కీలక నిర్ణయం.. తొమ్మిది నెలలే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో అమరావతి నిర్మాణంలో పనులను వేగిరం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా అధికారులకు డెడ్ లైన్ విధింాచరు. ఐఏఎస్ ల కోసం నిర్మిస్తున్న టవర్ల నిర్మాణంలో పనుల పెండింగ్ ను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఇవ్వాలంటూ సీఆర్డీఏ ప్రతిపాదనలను రూపొందించింది. ఈ టవర్లలో పెండింగ్ పనులను పూర్తి చేయడానికి 525 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపింది. ఈ మేరకు అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి అందించింది.
టవర్ల నిర్మాణంలో...
దీంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్లకు సంబంధించిన పనులకు సంబంధించిన అంచనాలను కూడా అందులోనే పేర్కొంది. అయితే దీనికి సంబందించి చంద్రబాబు నాయుడు అంచనాలను పరిశీలించిన తర్వాత ఈ పనులను పూర్తి చేయడానికి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. టవర్లను తొమ్మిది నెలల్లో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే 36 కోట్ల రూపాయలు వెచ్చించి ముళ్లపొదలు తొలగించారు. మళ్లీ చెట్లు పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తొమ్మిది నెలల్లోగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లకు సంబంధించిన టవర్లను అందుబాటులోకి తేవాలని చంద్రబాబు ఆదేశించారు.
పన్నెండు అంతస్థుల్లో...
సీడ్ యాక్సెస్ రహదారికి ఆనుకునే పన్నెండు అంతస్థులతో ఈ భవనాలను నిర్మిస్తున్నారు. మొత్తం పద్దెనిమిది టవర్లను నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 432 అపార్ట్మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లకు కేటాయిస్తారు. ఇప్పటి వరకూ ఈ టవర్ల నిర్మాణానికి 445 కోట్లు వెచ్చించింది. మరో 525 కోట్లను అంచనాలను రూపొందించింది. అంటే మొత్తం వెయ్యి కోట్ల రూపాయలతో ఈ టవర్ల నిర్మాణం జరిగిందని అనుకోవాలి. అది పూర్తయితే రాజధాని అమరావతికి ఒక రూపు రేఖలు వస్తాయని భావిస్తున్నారు. ముందు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటే తర్వాత అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టుకు సంబంధించి కొత్త భవనాలకు టెండర్లను పిలిచే అవకాశముందని తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి విషయంలో మంచి స్పీడ్ లో ఉన్నారు. నిధులు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడటం లేదు.
Next Story