Mon Dec 15 2025 00:19:59 GMT+0000 (Coordinated Universal Time)
సిక్కోలు సముద్రతీరంలో చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు

శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మత్య్సకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సముద్రతీరంలో మత్య్సకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మీతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కారి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్యతో ముచ్చటించారు.
మత్స్యకారుల కుటుంబాలతో...
మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్‌కు చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి .చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకునే ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించారు.
Next Story

