Thu Dec 19 2024 08:38:23 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అచ్యుతాపురం సెజ్ బాధితులకు బాబు భరోసా
అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి గాయపడిన బాధితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న చంద్రబాబు నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. క్షతగాత్రులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి గాయపడిన వారందరికీ సరైన వైద్యం అందించాలని ఆదేశించారు.
త్వరగా కోలుకునేలా...
త్వరగా బాధితులు కోలుకునేలా చికిత్స అందించాలని చంద్రబాబు వైద్యులను కోరారు. బాధిత కుటుంబాలతో చంద్రబాబు నేరుగా మాట్లాడి తాను వారితో మాట్లాడి వచ్చానని కోలుకుంటున్నారని చెప్పారు. వారికి అందుతున్న సాయం గురించి బాధిత కుటుంబాలకు తెలియజేశారు. మొత్తం 36 మందికి గాయాలయ్యాయని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Next Story