Tue Dec 24 2024 02:45:39 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఎన్డీఏ శాసనసభ సభపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఉన్న అనుభవం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగ పడుతుందని తాను వేసిన అంచనా నిజమయిందని, మూడు నెలల్లోనే తనకు అవగతమమయిందని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయన నాయకత్వంలో తాను పనిచేయడం ఎంతో సంతృప్తి నిస్తుందన్నారు. వంద రోజుల్లోనే అనేక హామీలను నెరవేర్చామన్న పవన్, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు వరసగా హామీలను అమలు చేసుకుంటూ పోతున్నామని తెలిపారు.
వరదల సమయంలో...
అందుకు చంద్రబాబు ప్రధాన కారణమని ఆయన తెలిపారు. ప్రధానంగా వరదల సమయంలో ఆయన చూపించిన తెగువ, సాహసాన్ని అందరూ అభినందించి తీరాల్సిందేనని పవన్ కల్యాణ్ అన్నారు. ఇచ్చిన మాట మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి రైతులకు భరోసా కల్పించారన్నారు. ఆయన ఓపికతో ఈ వయసులోనూ నిరంతరం ప్రజల కోసం పడుతున్న శ్రమ తనను ఆకట్టుకుంటుందని పవన్ అన్నారు. ఆయన పాతికేళ్ల యువకుడిలా పనిచేయడం ఆశ్చర్యం కూడా కలిగిస్తుందన్నారు. వరదల సమయంలో ఆయన బురదలోకి వెళ్లి మరీ పేదలకు సాయం అందించడానికి పడిన తపన ఎవరూ మర్చిపోకూడదన్నారు. ఆయన నుంచి ఎంతో నేర్చు కోవాల్సి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.
Next Story