Mon Dec 23 2024 17:17:09 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఐదు సంతకాలు.. ఫైళ్లను రెడీ చేసిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయానికి రానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయానికి రానున్నారు. తిరుమల నుంచి విజయవాడకు చేరుకుని సాయంత్రం నిర్ణయించిన ముహూర్తం మేరకు 4.41 నిమిషాలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సచివాలయం అధికారులు, సిబ్బంది చంద్రబాబుకు భారీగా స్వాగతం పలకనున్నారు. తొలుత బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఐదు ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ ఫైళ్లపై...
మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగానే తొలి సంతకం టీచర్ల నియామకం జరిపే ఫైలుపైనే ఆయన సంతకం చేయనున్నారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసే ఫైలుపై సంతకం పెట్టనున్నారు. ఇక మూడోది జులై నెల నుంచి నాలుగు వేల రూపాయల పింఛను ఇచ్చే ఫైలును క్లియర్ చేయనున్నారు. తర్వాత స్కిల్ సెన్సస్ ప్రక్రియ, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఆయన సంతకాలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story