Sun Dec 22 2024 22:53:58 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : శపథం నెరవేరిన వేళ.. నేడు సీఎంగా చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన శపథం తర్వాత తొలిసారి నేడు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన శపథం తర్వాత తొలిసారి నేడు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. గత ప్రభుత్వ హయాంలో తనకు అసెంబ్లీ సమావేశాల్లో అవమానం జరిగిందని చంద్రబాబు నాయుడు సభలోనే శపథం చేసి బయటకు వచ్చారు. తన కుటుంబ సభ్యులను కించపర్చే విధంగా మాట్లాడటంతో ఆయన ఈ సభలో ఉండలేనని, తిరిగి ముఖ్యమంత్రిగానే ఈ సభలోకి అడుగుపెడతానని శపథం పూని చంద్రబాబు నాడు సభ నుంచి వెళ్లిపోయారు.
మూడేళ్ల తర్వాత...
2021 నవంబరు 19వ తేదీన శాసనసభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు నాటి నుంచి శాసనసభలోకి అడుగుపెట్టలేదు. జనంలోనే ఉన్నారు. ఇటీవల తిరిగి కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారి శాసనసభకు చంద్రబాబు రానున్నారు. తాను చేసిన శపథం పై నిలబడి మరీ చంద్రబాబు జనంలోకి వెళ్లి పార్టీని గెలిపించుకుని, తిరిగి ముఖ్యమంత్రిగా సభలో కాలుమోపుతున్నారు.
Next Story