Thu Apr 24 2025 11:47:03 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు నిధులు కేటాయించినందుకు కేంద్రమంత్రులను కలసి చంద్రబాబు స్వయంగా ధన్యవాదాలను తెలియజేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
ఎన్నికల ప్రచారంలో...
ఈరోజు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని చంద్రబాబు నిర్వహించనున్నారు. ఢిల్లీలో తెలుగువాళ్లు కూడా ఉండటంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు ఈ పర్యటన చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరుపున ఆయన ప్రచారం చేయనున్నారు. బీజేపీని గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పనున్నారు.
Next Story