Fri Jan 10 2025 12:13:18 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఈ నెల 7న ఢిల్లీకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించిన నిధుల మంజూరుపై చర్చించనున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా చంద్రబాబు మోదీకి వివరించానున్నారు.
రైల్వే జోన్ పై...
దీంతో పాటు వివిధ రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది. రైల్వే శాఖ సహాయ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలసి విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావించనున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇస్తున్నామని, అందుకోసం వెంటనే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరనున్నారు. మరికొందరి కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశముంది.
Next Story