Sat Dec 28 2024 02:35:06 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ప్రధానితో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. నిన్న ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో అపాయింంట్మెంట్ ఫిక్స్ అయింది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం కానున్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు.
నష్టపోయిన ఏపీకి...
ఏపీ అన్ని విధాలుగా నష్టం పోయిందని ప్రత్యేకంగా గుర్తించి రాష్ట్రానికి తగిన సాయం అందించాలని చంద్రబాబు కోరనున్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. రుణాల రీషెడ్యూల్ చేయాలని కోరనున్నారు. రాత్రి ఏడు గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవుతారు.
Next Story