Thu Dec 26 2024 13:51:14 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు పార్టీ పార్లమెంటు సభ్యులు స్వాగతం పలికారు. రాత్రికి కూటమి పార్టీ ఎంపీలకు చంద్రబాబు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రధానికి వినతి పత్రాన్ని అందచేయనున్నారు.
కేంద్ర మంత్రులను కూడా...
ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా చంద్రబాబు కలవనున్నారు. రానున్న బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక నిధులను కేటాయించాలని కోరనున్నారు. పోలవరం, రాజధాని కోసం నిధులను ప్రత్యేకంగా బడ్జెట్ లో కేటాయించాలని చంద్రబాబు నిర్మలమ్మకు సూచించనున్నారు. దీంతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులను వీలయినంత త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రులను కలసి చంద్రబాబు కోరనున్నారు.
Next Story