Fri Jan 10 2025 15:35:25 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలపై సమీక్ష చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలపై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రబాబు సచివాలయానికి చేరుకుంటారు.అనంతరం క్రీడా యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖపై సమీక్ష జరపనున్నారు. స్టార్టప్ కంపెనీలను యువత ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించనున్నారు.
వివిధ శాఖలపై సమీక్ష...
దీంతో పాటు యూత్ పాలసీ రూపకల్పనపై కూడా అధికారులతో చర్చించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. తర్వాత పారిశ్రామిక పాలసీ రూపకల్పనపై కూడా చంద్రబాబు అధికారులతో సమీక్షించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. నూతనంగా ఏర్పాటుచేయనున్న ఇండ్రస్ట్రియల్ పార్క్లపై కూడా చర్చించనున్నారు. పారిశ్రామిక కారిడార్ల డెవలెప్మెంట్పై కూడా సమీక్ష చేయనున్నారు. అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story