Mon Dec 23 2024 10:52:49 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : రేపు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ల తో పాటు ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్లను కూడా చంద్రబాబు పరిశీలలించనున్నారు. గతంలో తాము నిర్మాణం చేపట్టి పూర్తయిన దశలో ఉన్న క్వార్టర్లను చంద్రబాబు పరిశీలించనున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పెరిగిన పిచ్చి చెట్లను సీఆర్డీఏ అధికారులు తొలగించారు.
తన ప్రాధాన్యత ఏంటో?
దీంతో పాటు ఎమ్మెల్యేల క్వార్టర్లను కూడా చంద్రబాబు పరిశీలించే అవకాశముంది. చంద్రబాబు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుండటంతో తన ప్రాధాన్యతలు ఏమిటో అధికార యంత్రాంగానికి చెప్పినట్లవుతుందని అంటున్నారు. తొలి పర్యటన పోలవరం, రెండో పర్యటన రాజధాని ప్రాంతాన్ని ఎంచుకుని ఈ రెండు తన ప్రయారిటీ అని బలమైన సంకేతాలను అధికారులకు పంపేందుకే రేపు చంద్రబాబు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
Next Story