Mon Dec 23 2024 11:35:23 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు మచిలీపట్నానికి చంద్రబాబు
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నంలో పర్యటించనున్నారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో పర్యటించనున్నారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ముందగా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మచిలీపట్నానికి బయలుదేరి వెళారు. అక్కడ నేషనల్ లా కాలేజీ, డంపింగ్ యార్డు, టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో...
ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తును కూడా నిర్వహిస్తున్నారు.
Next Story