Mon Dec 23 2024 01:53:31 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఆగస్టు 1న శ్రీశైలానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 1వ తేదీన శ్రీశైలానికి రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 1వ తేదీన శ్రీశైలానికి రానున్నారు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లను అధికారులు ఎత్తి నీళ్లను నాగార్జున సాగర్ లోకి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీశైలం జలాశయాన్ని చంద్రబాబు పరిశీలిస్తారు.
ప్రాజెక్టు పరిశీలన...
కృష్ణానదిలో చంద్రబాబు నాయుడు జలహారతి ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత శ్రీశైలం కుడి జలవిద్యుత్తు కేంద్రాన్ని చం్రబాబు పరిశీలిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడంతో ఇప్పటికే పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది.
Next Story