Sat Dec 21 2024 14:13:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు రేపల్లెకు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈరోజు రేపల్లెలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈరోజు చంద్రబాబు రేపల్లెలో పర్యటించనున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగడంతో రేపల్లె పట్టణంలో కూడా వరద వచ్చింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పాలయ్యారు.
బాధితులకు పరామర్శ...
రేపల్లె ప్రాంతంలో పర్యటించి బాధితులకు సాయం అందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీయనున్నారు. రేపల్లె కు చంద్రబాబు వస్తుండటంతో అక్కడ ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు అధికారులు కూడా చేశారు. బాధితులను పరామర్శించడమే కాకుండా అధికారులతో కూడా చంద్రబాబు సమీక్షించనున్నారు.
Next Story