Sun Dec 22 2024 23:28:51 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు తిరుపతి జిల్లాకు చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈరోజు ఉదయం ఉండవల్లి తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చంద్రబాబుకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా శ్రీసిటీకి చంద్రబాబు వెళ్లనున్నారు. శ్రీసిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు.
900 కోట్ల పెట్టుబడులు
పదిహేను సంస్థల కార్యకలాపాలను శ్రీసిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. మరో ఏడు సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 900 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2,740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో రూ.1,213కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.శ్రీసిటీలో పర్యటన అనంతరం నెల్లూరు జిల్లా లో సోమశిల సాగునీటి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. తిరిగి సాయంత్రం ఉండవల్లి చేరుకోనున్నారు.
Next Story