Mon Dec 23 2024 08:04:33 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చంద్రబాబు నాయుడు సచివాలయానికి రానున్నారు. ఆయన తొలుత ఆర్థికశాఖపై సమీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లను ఎలా అధిగమించాలా అన్నదానిపై కన్సల్టెన్సీ సంస్థతో అధ్యయనం చేయించాలన్న దానిపై అధికారులతో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలిసింది.
ఆర్థిక శాఖపై...
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉంది. అప్పులు పెరిగిపోవడంతో వడ్డీలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని, దీనివల్ల సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నామని భావిస్తున్నారు. ఈ సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు సాంఘిక సంక్షేమ శాఖపై సమీక్ష చేయనున్నారు చంద్రబాబు.
Next Story