Fri Jan 10 2025 11:50:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఢిల్లీలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన చంద్రబాబు నాయుడు ను నేడు వివిధ కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలసి రాష్ట్ర నిధుల విడుదలపై చర్చించనున్నారు.
కేంద్ర మంత్రులను...
మరికొందరి నేతలను కూడా చంద్రబాబు నాయుడు కలిసే అవకాశముంది. వివిధ శాఖల మంత్రులను కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి వారితో చర్చించనున్నారు. నిన్న ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కలిశారు. నేడు అమిత్ షాను కూడా కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story