Thu Jan 09 2025 21:58:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి చేరుకుని బైరాగిపట్టెడ ప్రాంతాన్ని పరిశీలించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి చేరుకుని బైరాగిపట్టెడ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ అధికారులతో ఫైర్ అయ్యారు. కొత్తప్లేస్ లో పెట్టినప్పుడు ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని టీటీడీ ఈవో శ్యామలరావును ప్రశ్నించారు. ఎందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోలేదని అధికారులపై మండిపడ్డారు. కొత్త ప్లేస్ లో పెడుతున్నప్పుడు ఏం చేయాలో? ఏం చేయకూడదో కనీసం తెలియదా? అని శ్యామలరావును ప్రశ్నించారు.
అధికారులపై మండిపాటు...
కనీసం ఈ ఏర్పాట్లకు సంబంధించి వాట్సాప్ గ్రూప్ ను అయినా అధికారులు క్రియేట్ చేసుకున్నారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఈవో శ్యామలరావు గత పాలకవర్గం తరహాలోనే ఈసారి కూడా అదే రీతిలో తాము కూడా వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేశామని ఆయన చెబుతుండగా, ఎవరో ఏదో చేశారని, మీరూ అదే చేస్తారా? కనీసం కొత్త విధానాన్ని అవలంబించరా? అని నిలదీశారు.
Next Story