Mon Nov 18 2024 22:41:40 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఏపీలో నూతన విద్యుత్ విధానం
రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దేశంలోనే సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఏపీ మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దీని కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నూతన ఇంధన విధానంపై అధికారులతో సమీక్షించిన ఆయన అత్యుత్తమ విధానాలు, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.దేశంలో ఒకవైపు విద్యుత్ అవసరాలు పెరుగుతుంటే సహజ వనరులు మాత్రం తరిగిపోతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకు సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడటమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు.
సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో...
గతంలో తెలుగుదేశం హయాంలో సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచామని గుర్తు చేశారు. కానీ గత వైఎస్సార్సీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలతో ఇంధనశాఖ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. మళ్లీ సంప్రదాయేతర ఇంధన వనరుల కేంద్రంగా ఏపీ మారాల్సిన తరుణం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తికి ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద కేంద్రం అవుతుందన్నారు. రాష్ట్రంలో సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలా కొత్త పాలసీ రూపొందించాలని సీఎం సూచించారు.
Next Story