Sat Jan 11 2025 16:46:05 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : సంక్రాంతి వేళ అందరికీ గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఆరువేల కోట్లు
సంక్రాంతి వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అన్ని పెండింగ్ బిల్లులను చెల్లించాలని అధికారులను ఆదేశించారు
సంక్రాంతి వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అన్ని పెండింగ్ బిల్లులను చెల్లించాలని అధికారులను ఆదేశించారు. సుమారు ఆరు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక శాఖపై జరిగిన సమీక్షలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.
బిల్లులు చెల్లింపునకు ఓకే
సీపీఎస్ కు సంబంధించి 300 కోట్లు, జీపీఎఫ్ కు 519 కోట్లు విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ఆసుపత్రులకు చెల్లించాల్సిన మూడు వేల కోట్ల బకాయీల్లో 400 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల నుంచి భూములను సేకరించి గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని,వారికి కూడా డబ్బులు చెల్లించేలా ఏర్పాటుచేయాలని చంద్రబాబు ఆదేశించారు.
Next Story