Sat Apr 05 2025 02:23:30 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పెద్దగంజాంలో పింఛన్ల పంపిణీని ఆయన చేపట్టనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పెద్దగంజాంలో పింఛన్ల పంపిణీని ఆయన చేపట్టనున్నారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీని ప్రతి నెల ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నారు. తొలిసారి తమ గ్రామానికి చంద్రబాబు వస్తుండటంతో పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు.
ప్రజావేదికలో ప్రసంగం...
అనంతరం అక్కడ రామాయలంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రామంలో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించనున్నారు. తర్వాత పర్చూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. వారి కష్ట నష్టాలను గురించి అడిగి తెలుసుకుంటారు.
Next Story