Sun Dec 22 2024 15:14:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandraabu : నేడు శ్రీశైలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆయన శ్రీశైలం వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
జలహారతి ఇచ్చిన....
తర్వాత శ్రీశైలం జలాశయాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. అక్కడ కృష్ణానదికి జలహారతిని సమర్పించనున్నారు. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు రావడంతో గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ లోకి వదులుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడే ఇరిగేషన్ శాఖ అధికారులతో భేటీ అవుతారు. తర్వాత శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం నీటి వినియోగదారులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి నేరుగా అనంతపురం జిల్లా మడకశిరకు బయలుదేరి వెళతారు.
Next Story