Fri Dec 20 2024 16:46:03 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నిర్మలమ్మను కలిసిన బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆమెను చంద్రబాబు కోరారు. తగిన చేయూతనిచ్చి ఉదారంగా నిధులను మంజూరు చేయాలన్నారు. అలాగే కేంద్ర బడ్జెట్ లోనూ ఏపీకి కొంత ప్రయోజనం చేకూర్చేలా నిధుల కేటాయింపు చేయాలని చంద్రబాబు నిర్మలా సీతామన్ కు విజ్ఞప్తి చేశారు.
కేంద్రమే ఆదుకోవాలంటూ...
రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దీంతో కూడా రుణాలను పొందేందుకు కొంత మినహాయింపులు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిసింది. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లు కూడా ఉన్నారు. మరికాసేపట్లో నీతి అయోగ్ సీఎంతో సమావేశం కానున్నారు. తర్వాత కేంద్ర మంత్రులను కలసి ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
Next Story