Mon Dec 23 2024 18:10:58 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై అచ్చెన్న ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతూ కాలం గడిపేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అబద్ధాలు చెబుతూ కాలం గడిపేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి అనేది కనపడదని చెప్పారు. దాని సంగతి పక్కన పెడితే ఈ రెండున్నరేళ్లలో జగన్ బారిన పడని వర్గమంటూ ఏదీ ఉండదని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా జగన్ ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటుందని అన్నారు.
అబద్ధాలతోనే.....
ముఖ్యమంత్రి జగన అబద్ధాలు ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనపడుతుందన్నారు. చిరుద్యోగుల జీతాలపై కూడా ప్రభుత్వం అబద్దాలు ఆడుతూ లబ్ది పొందాలని ప్రయత్నిస్తుందని అచ్చెన్నాయుడు మండి పడ్డారు. అందరినీ తమ అబద్దాలతో పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ అవి ఎక్కువ కాలం నిలవవని గుర్తించాలని అన్నారు.
Next Story