Wed Jan 08 2025 07:29:11 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు నారావారాపల్లిలో చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నారా వారిపల్లిలోనే ఉండనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నారా వారిపల్లిలోనే ఉండనున్నారు. ఆయన తన సోదరుడు రామ్మూర్తి నాయుడు కర్మక్రియలో పాల్గొనేందుక నిన్ననే నారావారిపల్లి చేరుకున్నారు. ఈరోజు నుంచి కర్మక్రియలు జరగనుండటంతో చంద్రబాబు నారా వారిపల్లికి వచ్చారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లపై చంద్రబాబు చర్చించారు.
భారీ పోలీసు బందోబస్తు...
మండలంలోని నారావారిపల్లి గ్రామంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్వగృహం నందు జరిగే మాజీ ఎమ్మెల్యే నారా రామూర్తి నాయుడు కర్మ క్రియలకు హాజరయ్యేందుకు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీఐపీల రానున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవి మనోహర్ ఆచారి, చంద్రగిరి డిఎస్పి బి ప్రసాద్, సీఐ సుబ్బరామిరెడ్డిల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఐపీల కార్ పార్కింగ్, చెక్ పోస్ట్లు, భోజనశాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.
Next Story