Wed Apr 23 2025 20:05:24 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం పన్నెండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి వస్తారు. వివిధ శాఖలతో సమీక్ష చేయనున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితులపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
సమీక్షలు నిర్వహించి...
సచివాలయానికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో మెట్రో నిర్మాణం, ఫ్లైవోవర్ నిర్మాణం అంశంపై సమీక్ష జరపనున్నారు. విశాఖ మెట్రో రైలు పనుల ప్రారంభం, డీపీఆర్ వంటి వాటిపై చర్చించనున్నారు. అనంతరం పైనాన్స్ కమిషన్ తో చర్చించే అంశాలపై ఆర్థిక శాఖ అధికారులతో రివ్యూ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఐపిబి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు
Next Story