Mon Dec 23 2024 07:34:22 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ నేడు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ నేడు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ప్రతి రోజూ చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా వివిధ శాఖలపై సమీక్షలను నిర్వహిస్తున్నారు. ఆ యా శాఖల్లో తీసుకోవాల్సిన మార్పులు, గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లపై చర్చ జరిపి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
సమీక్షలతో...
అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కూడా సమీక్షలు నిర్వహిస్తన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి చంద్రబాబు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో తీసుకువస్తున్న పలు నూతన పాలసీలపై అధికారులతో సమీక్షిస్తారు.ఇందులో భాగంగా ఇండస్ట్రియల్, ఎంఎస్ఎంఈ, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్ డ్రాఫ్ట్ పాలసీలపై విడివిడిగా చర్చించనున్నారు.
Next Story