Sun Dec 22 2024 13:57:02 GMT+0000 (Coordinated Universal Time)
నేవీ వేడుకల్లో పాల్గొన్న జగన్ దంపతులు
ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు
విశాఖపట్నం : ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నౌకాదళ సిబ్బంది నుంచి ముఖ్యమంత్రి జగన్ గౌరవ వందనం స్వీకరించారు. 36 దేశాల నౌకాదళ విన్యాస కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఐఎన్ఎస్ విశాఖ నౌక పశ్చిమ నౌకాదళంలో సేవలందించనుంది. జలాంతర్గామి ఐఎన్ఎస్ వేలను కూడా జగన్ దంపతులు సందర్శించారు.
సేవలు అభినందనీయం....
విశాఖ బీచ్ లో జరిగిన కార్యక్రమంలో జగన్ ప్రసంగించారు. భారత రక్షణ వ్యవస్థలో నౌకాదళ సిబ్బంది సేవలను జగన్ కొనియాడారు. సిబ్బందిని అభినందించారు. విశాఖపట్నం ప్రతిష్టను ఈ నౌక మరింత ఇనుమడింప చేస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణలు పాల్గొన్నారు.
Next Story