Thu Apr 10 2025 22:31:06 GMT+0000 (Coordinated Universal Time)
కందుకూరు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
కందుకూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కందుకూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారనాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ప్రకటించారు. కందుకూరు ఘటన దురదృష్టకరమైన ఘటన అని జగన్ అన్నారు.
త్వరగా కోలుకోవాలని...
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని జగన్ అధికారులను ఢిల్లీ నుంచి ఆదేశించారు. మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Next Story