Mon Dec 23 2024 02:57:53 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మత్స్యకారులకు నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత్స్యకారులకు నిధులను విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మత్స్యకారులకు నిధులను విడుదల చేశారు. ఓన్జీసీ పైపులైన్ ద్వారా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయాన్ని అందించారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలోని 23, 458 మంది మత్స్యకార కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని అందచేశారు. మొత్తం 161.86 కోట్ల రూపాయలను బటన్ నొక్కి ఆయన విడుదల చేశారు.
భారీ వర్షం కారణంగా...
ఈ సందర్భంగా జగన్ మత్స్యకారులతో మాట్లాడారు. నిజానికి మత్స్యకార దినోత్సవాన్ని సూళ్లూరుపేటలో జరుపుకోవాలనుకున్నా, భారీ వర్షాలతో వాయిదా పడిందని తెలిపారు. అందుకే వాయిదా వేసుకున్నామని చెప్పారు. అయినా ప్రభుత్వం మత్స్యకారులకు ఇవ్వాలని అనుకున్న సాయం ఆగిపోకూడదని భావించి క్యాంప్ కార్యాలయం నుంచి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరవు పులికాట్ సరస్సు లో పూడిక తీసి, గేట్లు తెరిచే కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగాని,వచ్చే నెలలో గాని చేపట్టనున్నట్లు తెలిపారు.
Next Story