Sun Nov 24 2024 05:32:30 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధానికి జగన్ లేఖ.. అభ్యంతరాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. కేంద్రానికి డిప్యూటేషన్ పై పంపే ఐఏఎస్ అధికారుల ఎంపిక విషయంలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలని జగన్ కోరారు. అయితే కేంద్రం తీసుకువస్తున్న సవరణల ప్రతిపాదనలను జగన్ స్వాగతించారు. అభినందించారు.
డిప్యూటేషన్ పై....
ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణణలను ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఈ మేరకు జగన్ ప్రధానిిక లేఖ రాశారు. రాష్ట్రాలు నిరభ్యంతర పత్రాలను విడుదల చేసిన తర్వాతే డిప్యూటేషన్ ఖరారవుతున్న ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలని జగన్ కోరారు. అలాగే డిప్యూటేషన్ పై వచ్చే ఐఏఎస్ అధికారి రిపోర్ట్ చేసే గడుడు నిర్ణయించే అధికారం కేంద్రానికి కట్టబెడుతూ తీసుకువస్తున్న సవరణలపై కూడా జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కీలక బాధ్యతల్లో ఉండే అధికారులను కేంద్రం సర్వీసుల్లోకి తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
Next Story