Sat Dec 21 2024 14:02:44 GMT+0000 (Coordinated Universal Time)
రేపు వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల
రేపు ఏపీముఖ్యమంత్రి జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుదల చేస్తారు
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏలూరు జిల్లా దెందులూరులో పర్యటిస్తున్నారు. వైఎస్సార్ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుని బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
దెందులూరుకు జగన్...
బహిరంగ సభకు దెందులోనూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దయెత్తున జనసమీకరణ చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నేతలు కసరత్తు చేస్తున్నారు. రేపు వైఎస్సార్ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనుండటంతో లబ్దిదారులతో జగన్ ప్రసంగించనున్నారు.
Next Story