Fri Dec 27 2024 01:57:27 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : విశాఖ పాలనకు ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. దసరా పండగను విశాఖలోనే జరుపుకోవాలని జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. దసరా పండగను విశాఖలోనే జరుపుకోవాలని జగన్ అన్నారు. దసరా రోజు నుంచే విశాఖలో పరిపాలన సాగిస్తానని ఆయన మంత్రివర్గ సమావేశం అనంతరం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దసరా నాటికి పాలన విశాఖ నుంచి సాగుతుందని తెలిపారు. తాను ఒక్కడినే అక్కడకు వెళ్లి ముందుగా పాలన ప్రారంభిస్తామని, అమరావతిలో మాత్రం శాసన రాజధాని కొనసాగుతుందని మంత్రులకు చెప్పినట్లు తెలిసింది.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా....
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కూడా మంత్రులకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమై ముందస్తు ఎన్నికలకు వెళ్లినా మనం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్ చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు అవినీతి అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. అవసరమైతే అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అవినీతిపై చర్చించాలని కూడా జగన్ అన్నారని చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎవరూ గైర్హాజరు కావద్దని, ఖచ్చితంగా హాజరయ్యేలా చూసుకోవాలని కూడా మంత్రులను ఆదేశించినట్లు సమాచారం.
Next Story