Mon Dec 23 2024 09:01:42 GMT+0000 (Coordinated Universal Time)
నిర్మలమ్మతో జగన్ భేటీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. నిన్న అమిత్ షాతో చర్చించిన జగన్ నేడు నిర్మలమ్మతో భేటీ అయ్యారు. విజయవాడకు వచ్చే ముందు ఆయన ఆర్థికమంత్రితో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంపై చర్చించారు. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై నిర్మలా సీతారామన్ తో చర్చించారు.
నిధుల విడుదలపై...
నిర్మలా సీతారామన్ తో జగన్ సమావేశం దాదాపు నలభై నిమిషాలు పాటు సాగింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. నిర్మలా సీతారామన్‌కు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జగన్ అనంతరం విజయవాడ బయలుదేరారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Next Story