Tue Dec 24 2024 13:41:04 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ తో జగన్ భేటీ.. అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లిన జగన్ ఆయనతో కొొద్దిసేపు చర్చించారు. ప్రధానంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆయన చర్చించినట్లు తెలిసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును పెట్టి ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే.
హెల్త్ వర్సిటీ...
అయితే యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ అయిన గవర్నర్ కు చెప్పకుండానే ఈ బిల్లును అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై టీడీపీ నేతలు సయితం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పేరు ఎందుకు మార్చ వలసి వచ్చిందీ అనే అంశంపై జగన్ గవర్నర్ కు వివరించినట్లు తెలిసింది. దీంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నామన్న విషయంపై కూడా జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.
Next Story