Thu Nov 28 2024 15:48:14 GMT+0000 (Coordinated Universal Time)
కాపుల ఓట్లను దత్తపుత్రుడు అమ్మేయాలని చూస్తున్నాడు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఫైర్ అయ్యారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. కాపులందరికీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. వైఎస్సార్ కాపునేస్తం పథకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జగన్ మాట్లాడుతూ కాపు నేస్తమే కాదు, కాపు కాస్తామని జగన్ తెలిపారు. వరసగా మూడో ఏడాది కాపు నేస్తాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ మూడేళ్లలో 1,600 కోట్ల రూపాయలుకు పైగానే కాపు మహిళలకు ఈ పధకం కింద ప్రభుత్వం అందించిందని జగన్ వివరించారు. ఈ పథకం కింద మూడు లక్షల మందికి పైగా లబ్డి పొందుతున్నారన్నారు. పారదర్శకతతో ఈ ప్రభుత్వం పథకాలను అందరికీ దక్కేలా చూస్తుందన్నారు. అర్హులైన అందరికీ పథకాలను వర్తింప చేస్తున్నామని చెప్పారు.
బడ్జెట్ లో కేటాయించిన....
గత ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించిన డబ్బులు కూడా ఖర్చు చేయలేదన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులైన వారందరికీ ఈ ప్రభుత్వం పథకాలను అందచేస్తుందన్నారు. అర్హులైతే చాలు వారికి పథకాలు మంజూరయినట్లేనని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ చెప్పిన వారికే పథకాలు అందేవన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు పాలనలో దోచుకో, పంచుకో, తినుకో స్కీమ్ ద్వారా పథకాలు అందేవని అన్నారు. దుష్టచతుష్టయం ఈ స్కీమ్ ను అమలు చేసేవారన్నారు. అప్పటికీ ఇప్పటికీ మార్పును చూడాలని జగన్ కోరారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా అందరికీ సాయం అందుతుందన్నారు.
కాపు నేస్తం కాదు.. కాపు కాస్తాం...
చంద్రబాబు తన దుష్టచతుష్టయం, తన దత్తపుత్రుడు బాగుపడే పాలన కావాలా? లేదా అన్ని సామాజికవర్గాలు లబ్ది చేసే ప్రభుత్వం కావాలా? ఆలోచించుకోమని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారని జగన్ అన్నారు. కాపుల ఓట్లను కొంత మూటగట్టి హోెల్సేల్ గా మూటగట్టి చంద్రబాబుకు అమ్మేసే దత్తపుత్రుడి రాజకీయాలు కనిపిస్తున్నాయని అన్నారు. దత్తపుత్రుడి రాజకీయాలు ఎక్కువగా కన్పిస్తున్నాయన్నారు. గతంలో ఉన్న బడ్జెట్ ఇదేనని, కానీ అప్పుడు పేదలకు ఎందుకు ఇన్ని పథకాలు ఇవ్వలేకపోయాడో ఆలోచించమని కోరుతున్నానని అన్నారు.
Next Story